Mansa Musa I of Mali is the richest person who ever lived

ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు.

ఫోర్బ్స్ 1987 నుంచి ప్రపంచ ధనవంతుల జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. ఈ లెక్కలన్నీ డాలర్ రూపంలో ఉంటాయి. ఇలాంటి జాబితాలతోనే బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్ ఇలా ప్రపంచ కుబేరుల గురించి ప్రపంచానికి తెలుస్తోంది, కానీ ప్రపంచానికి తెలియని ఒక అపర కుబేరుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

1280 నుంచి 1337 మధ్య కాలంలో మాలి సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి మాన్సా మూసా సంపదను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యమే. ఆప్పటిలో మూసా ఆధీనంలో అనేక బంగారు గనులు ఉండేవి. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న కాలమది. ఆయన నిజమైన పేరు మొదటి మూసా కీటా. కానీ సింహాసనంపై కూర్చోవడంతో ఆయన పేరు మూసాగా మారింది. మాన్సా అనే పదానికి అర్థం రాజు అని. మాన్సా మూసా రాజ్యం ఎంత పెద్దదంటే దానికి సరిహద్దులు అంతు చిక్కేవి కావు. నేటి మారిటానియా, సెనిగల్ , జాంబియా, గిలియా, బూర్జినాఫాసో, మాలి, నైగర్, నైజిరియాలు నాడు మూసా సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఆనాడు మాన్సా మూసా నిర్మించిన మసీదులలో ఇంకా అనేక మసీదులు ఇప్పటికీ ఉన్నాయి. టింబక్ లోని జింగారిబర్ మసీదు మాన్సా మూసా నిర్మించిన అనేక మసీదుల్లో ఒకటి.

ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు.

మూసా సంపదని నేటి లెక్కల్లో అంచనా వేయడం కష్టమే. ఒక అంచనా ప్రకారం లెక్క వేస్తే అది భారత కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్లకు మించి కావొచ్చు. ఈటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అత్యంత ధనవంతుడిగా ప్రకటించారు. అప్పటికే ఆయన సంపద 6.7 లక్షల కోట్లు. దానితో పోలిస్తే మాన్సా మూసా సంపద సుమారు నాలుగు రెట్లు ఎక్కువని తేలింది.

మాన్సా మూసా ఆదేశాల ప్రకారం నిర్మించిన సంకోరే విశ్వ విద్యాలయం మాలి లో నిర్మించిన అతి పురాతన విద్యా సంస్థల్లో ఒకటి. మాన్సా మూసా 1324 లో చేసిన మక్కా యాత్ర గురించి నాడు ఒక చారిత్రక కథనం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఎందుకంటే ఆ యాత్ర సుమారు 6 వేల కిలోమీటర్లు సాగింది. ఆయన వెళ్లే దారిలో, దర్శించుకోవాలనుకున్న ప్రజలు ఆయన పారివారాన్ని చూసి నోరు వెళ్ళబెట్టేవారు. మాన్సా మూసా సైన్యంలో సుమారు 60 వేల మంది ఉండేవారు. వారిలో 12 వేల మంది కేవలం మాన్సా మూసా వ్యక్తిగత సహాయకులు. మాన్సా మూసా కి ముందు 500 మంది గుర్రాలపై స్వారీ చేస్తూ ఉండే వారు. వారి చేతుల్లో బంగారు కర్రలు ఉండేవి. ఈ 500 మంది అత్యంత ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించేవారు. దాంతో పాటు ఆయన బిడారుల్లో 80 ఒంటెల బృందం ఉండేది. దాని మీద 136 కిలోల బంగారం ఉండేది. మాన్సా మూసా ఎంత ఉదారుడు అంటే ఆయన బిడారు ఈజిప్ట్ రాజధాని కైరో గుండా ప్రయాణించేప్పుడు, అక్కడున్న పేదలకు ఆయన చేసిన దానంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అని చరిత్రలో కథనాలున్నాయి.

కెటలాన్ అట్లాస్ లో మాన్సా మూసా సామ్రాజ్యం మాన్సా మూసా మక్కా యాత్రతో ఆయన సంపద గురించిన వార్తలు యూరోప్ ప్రజల చెవిన పడ్డాయి. ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి అనేకమంది యూరోపియన్లు ఆయన సందర్శించేందుకు వచ్చేవారు. ఆయన సంపద నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత మాలి సామ్రాజాన్ని, ఆ రోజులులో ప్రముఖంగా ఉన్న కెటలాన్ అట్లాస్ లో చేర్చారు. 14వ శతాబ్దపు కెటలాన్ అట్లాస్ లో యూరోపియన్లు తమకు తెలిసిన అన్ని ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించేవారు. ఇలా మాలి సామ్రాజాన్ని 25 సంవత్సరాలు పాలించిన అనంతరం మూసా 1337 లో మరణించారు.